ఏపీటీఎఫ్:
ఈ రోజు కమీషనర్ పాఠశాల విద్య కె.సంధ్యారాణి గారిని కలసి అనేక సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
1.కర్నూలు నగరంలో బి.క్యాంప్ బాలుర ఉన్నత పాఠశాల , సిల్వర్ జూబ్లీ కళాశాల దగ్గర ఆటస్థలంలో క్లస్టర్ యూనివర్సిటీ భవనాలు పేరుతో నిర్మాణం చేపట్టడానికి గుంతలు త్రవ్వడం విషయాన్ని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. స్పందించిన కమీషనర్ కలెక్టర్, డి.ఈ.ఓ తో మాట్లాడ్డం జరిగింది.
2.డీఈఓ పూల్ లో ఉన్న టీచర్ల సమస్యలను వివరించడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు
3.ఏపీ టెట్ సబ్జెక్టు ల మార్పుల విషయం
4.కర్నూలు శివారు మండలాల్లో మైనర్ మీడియా కన్నడ వివిధ కేడర్ల పోస్టులను డియస్సి-18 లో భర్తీ చేయాలని
5.మూర్తి గారి బదిలీ గ్రీవన్స్ తదితర సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
CFMS సమస్యలపై సీఈఓ గారిని కలవడం జరిగింది.
అధికారులను కలసిన వారిలో ఏపీటీఎఫ్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ప్ర.కా: జి.హృదయరాజు, ఉర్దూ మైనారిటీ & ఈ.సి సభ్యులు జుల్ఫీకర్ , SCM సభ్యులు బాలకృష్ణ రెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్ర.కా లు శుభాకర్, టి.నాగరాజు, బషీర్, మూర్తి డీఈఓ పూల్ భాదితులు పాల్గొన్నారు
- ఏపీటీఎఫ్