స్పెషల్ టీచర్లకు మొండుచేయి:కె.వెంకటేశ్వరరావు & జి.హృదయ రాజ్
(ఏ.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు)
విడతలవారీ విధానం,వాయిదా పద్దతి విడనాడాలి
ఇటీవల రాష్ట్ర
ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానం తారాస్థాయికి చేరింది.ఉద్యోగులకు
చెల్లించాల్సిన కరువు భత్యం మూడు విడతలుగాను మరియు ఎన్నో సంవత్సరాల పాటు
దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 398
నోషల్ ఇంక్రిమెంట్లు పదవి విరమణ చేసిన తరువాత వర్తించేలా చేయడం
మరియు సి.పి.యస్ విధానం పై కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ను ఇప్పటికీ ప్రకటన
చేయకుండా కాలయాపన చేయడం దారుణమైన పరిస్థితి.
ఎప్పుడో ఇచ్చే ఈ. I. R కు ఇటీవల జి.వో జారీ
చేయడం వల్ల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కు ఉన్న గౌరవం స్పష్టమవుతున్నాది.
ఇకనైనా రాష్ట్ర
ప్రభుత్వం స్పందించి ఈ విడతలవారీ విధానం ను వాయిదా పద్దతిని మార్చుకోవాలని
ఏ.పి.టి.ఎఫ్ డిమాండ్ చేస్తున్నాది.