➸ ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు అపరాధంతో ప్రవేశ రుసుము చెల్లింపునకు ఈనెల 16వ తేదీ వరకు గడువును ప్రభుత్వం పొడగించినట్లు నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ ఎల్‌సీ.రమణారెడ్డి తెలిపారు.
➸ పదో తరగతికి రూ.100లు, ఇంటర్మీడియట్‌కు రూ.200లు అదనంగా చెల్లించాలన్నారు. పదో తరగతిలో ఓసీలకు రూ.1550లు, ఇంటర్‌కు రూ.1800లు చెల్లించాలన్నారు.
➸ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకున్న తరువాత సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్లతో లాగిన్ కావాలన్నారు.
➸ ఐడీ ద్వారా ఫోన్‌కు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ఆధారంగా అభ్యర్థులు స్వయంగా మీ సేవ, ఏపీ ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా రుసుము చెల్లించవచ్చన్నారు.
➸ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 74 ప్రకారం 40 శాతం వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉత్తీర్ణత మార్కులను తగ్గించారన్నారు.
➸ అంధులు, వినికిడిలోపం ఉన్నవారికి 35 నుంచి 20 మార్కులకు తగ్గించారని, ఆటిజం, బుద్దిమాంద్యం, మస్తిష్క పక్షవాతం ఉన్నవారికి 35 నుంచి 10 మార్కులకు తగ్గించారన్నారు.
➸ అభ్యసన వైకల్యం ఉన్నవారికి ఏదైనా ఒక పాఠ్యాంశంలో 20 మార్కులు, మిగిలిన వాటిలో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించనట్లేనన్నారు.