✍️Departmental Tests..
డిపార్ట్మెంటల్ పరీక్షల దరఖాస్తుకు ఈ నెల 27వ తేదీ తుది గడువు
★ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి పరీక్షలు
★ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల అర్హతకు తప్పనిసరి
★ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు శాఖా పరీక్షలు (డిపార్ట్మెంటల్) జరగనున్నాయి.
★ ఆన్లైన్ విధానంలో జరగనున్న పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 27 ముగియనుంది.
★ ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో పూర్తి వివరాలను పొందుపర్చారు.
★ జీవో టెస్ట్ రాసేందుకు రూ. 1500, ఈవో టెస్ట్, స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు రాసేందుకు రూ.వెయ్యి చొప్పున పరీక్ష ఫీజును ఈ నెల 26వ తేదీలోపు ఏపీపీఎస్సీ సైట్లో చెల్లించి, 27వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంది.
★ శాఖల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులు వారికి ఇచ్చే ప్రశ్నాపత్రంలో ప్రతి పేపరు కనీసం 35 మార్కుల చొప్పున సాధించాల్సి ఉంటుంది.
★ జీఓటీ సబ్జెక్ట్ లోని రెండు పేపర్లకు సంబంధించి ప్రతి పేపర్లో 35 మార్కులు చొప్పున కచ్చితంగా సాధించాల్సి ఉందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
★ దీంతో పాటు ప్రతి మూడు సరైనవి కాని జవాబులకు ఒక మార్కు తగ్గిస్తారు.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐