ట్రస్టు సమావేశంలో దీనిపై మాట్లాడతాం...
ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, జి.హృదయరాజు వెల్లడి
..........................................
నెట్ వర్కు ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా కోవిడ్ కు వైద్యం అందేలా చూడాలని గట్టిగా కోరనున్నట్లు రాష్ర్ట ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక(JAC) ఛైర్మన్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, కో-ఛైర్మన్ జి.హృదయరాజు చెప్పారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సమావేశంలో బుధవారం(ఈరోజు) ఉద్యోగుల ఆరోగ్య కార్డు సమస్యలపై చర్చిస్తామని వారు ‘ ఉద్యోగులు న్యూస్’ కు చెప్పారు. ఒక వేళ ఆరోగ్య కార్డు అనమతించని పక్షంలో వైద్యానికి అయ్యే ఖర్చును రీ యింబర్సు చేసే అవకాశం ఉండాలని డిమాండ్ చేస్తమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్న సమయంలోనే కోవిడ్ బారిన పడ్డారని, వారికి నెట్ వర్కు ఆస్పత్రుల్లో , కోవిడ్ ఆస్పత్రుల్లోను సరైన వైద్యం అందలేదని JAC నేతలు చెప్పారు. ఆరోగ్యం వైద్యానికి సంబంధించిన అంశాలన్నీ చర్చిస్తామని చెప్పారు.