బకాయి వున్న డి.ఏ బకాయిలను ,రెండు నెలల సగం జీతాలను వాయిదాల విధానంలో కాకుండా వెంటనే చెల్లించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.హృదయ రాజు, కె. వెంకటేశ్వరరావు లు ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే బకాయి వున్న డి. ఏ లను మరింత బకాయిగా చేసే కార్యాచరణ ప్రభుత్వం మానుకోవాలని, ధరలు అమాంతంగా పెరిగే సూచిక ననుసరించి డి. ఏ లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలలో ఎక్కువ శాతం ఉద్యోగి కటింగ్స్ కు వెళ్తాయి కాబట్టి దశలవారీగా కాకుండా ఒకే సారి మంజూరు చేయాలని ఏపిటీఎఫ్ డిమాండ్ చేసింది.
- జి.హృదయ రాజు &
కె.వెంకటేశ్వరరావు, ఏపిటీఎఫ్