రాష్ట్రంలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా నియమకమైన 1476 మంది స్కూల్ అసిస్టెంట్ లకు జీతాల మంజూరుకు డైరెక్టర్, ట్రెజరీ శాఖ వారు ఉత్తర్వు జారీ చేసినట్లు APTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, కె.వెంకటేశ్వర రావు లు తెల్పారు .
రాష్ట్రంలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకం - సహిత విద్య లో భాగంగా 1476 మంది స్కూల్ అసిస్టెంట్ లు నియామకం పొంది జీతాల చెల్లింపు హెడ్ ఆఫ్ అకౌంట్ స్పష్టత లేని కారణంగా గత 9 నెలలు నుండి జీతాలు లేని విషయాన్ని పాఠశాల విద్య, డైరెక్టర్ కు APTF ప్రాతినిధ్యం చేయడం జరిగింది. విద్యా శాఖ వారు కేడర్ స్త్రెంత్ వివరాలను ట్రెజరీ కి పంపడం జరిగింది. ఆ మేరకు ట్రెజరీ శాఖ డైరెక్టర్ జీతాల చెల్లింపులకు సంబందించి అన్ని జిల్లాల ట్రెజరీ అధికార్లకు స్పష్టత నిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. త్వరలో బకాయి వున్న 9 నెలల జీతాలు పొందుటకు మార్గం సుగమం అయ్యిందని ఎపిటీఎఫ్ తెల్పింది.