★ కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా క్విజ్ -2021 నిర్వహించనున్నట్టు..
★ పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు, రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యద ర్శి జి.భానుమూర్తి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
8వ తరగతి, ఆపై తరగతులు చదివేవారు క్విజ్ లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.
★ పాఠశాలలు,
★ యూక్లబ్స్ ,
★ వ్యక్తిగతంగా,
★ సమూహంగా పాల్గొనవచ్చన్నారు.
★ జూలై 1 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయని తెలిపారు.
★ పాఠశాలస్థాయి,
★ ప్రాథమిక స్థాయి,
★ రాష్ట్ర స్థాయి,
★ జాతీయ స్థాయి..
ఇలా నాలుగు రౌండ్లుగా క్విజ్ ఉంటుందని, విజేతలకు నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు.
★ https://fitindia.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు . రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి విద్యార్థికి రూ.250 గా నిర్ణయించామన్నారు