SSC Board Director సుబ్బారెడ్డి గారిని బదిలీ చేస్తూ , కె.రవీంద్రనాథ్ రెడ్డి గారికి భాద్యతలను ఇస్తూ ముఖ్య కార్యదర్శి శ్రీ.B.రాజశేఖర్ గారు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.-
ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగులను వేధింపులకు గురి చేశారని ఇటీవల ఆరోపణలు వచ్చిన అడిషనల్ డైరెక్టర్ ఎ. సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. పాఠశాల విద్యాశాఖలో సుబ్బారెడ్డి మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అలాగే ప్రభుత్వ పరీక్షల సంచాలకులుగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులను సుబ్బారెడ్డి వేధిస్తు న్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అంతే కాకుండా కార్యాలయం వద్ద వారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారని, నచ్చని సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ఉద్యోగిపై చేయి చేసుకున్నారని, మహిళా ఉద్యోగినులను అదన పు సమయం పని చేయాలని వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మహిళా కమిషన్, పోలీసులకు ఫిర్యాదులు సైతం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 రోజులకుపైగా నిరసనలు నిర్వహించడంతోపాటు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు సుబ్బారెడ్డిని బదిలీ చేయాలని వినతులు అందజేశారు. ఈ నేపథ్యంలో గురువా రం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేస్తున్న ఉత్తర్వు ల్లో అదనపు బాధ్యతల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఆ స్థానం లో ఏపీఎంఎస్ జాయింట్ డైరెక్టర్ కె. రవీంద్రనాథ్ రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తు న్నట్లు పేర్కొన్నారు. ఏడీ సుబ్బారెడ్డిని ఇన్చార్జ్ విధుల నుంచి తొలగించడంపై ఏపీ ఎన్టీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి, జేఏసీ సెక్రటరీ జనరల్ జి. హృదయ రాజు హర్షం వెలిబుచ్చారు.