వేసవి సెలవుల్లో 2017-19, 2018-20 బ్యాచ్ డీఈ ఎల్‌ఈడీ విద్యార్థుల కోర్సును కొనసాగిం చాలని ప్రభుత్వ డైట్‌ప్రిన్సిపాళ్ళు, ప్రవేటు డీఈఎల్‌ఈడీ పాఠశాలల ప్రిన్సిపాళ్ళను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు
🔹డీఈఎల్‌ఈడీ 2017- 19 బ్యాచ్ విద్యార్థుల విజ్ఞప్తి వేరకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణ యించారు.
ఈ బ్యాచ్ విద్యార్థులు ద్వితీయ సంవత్సరం కోర్సు, ఈఏడాది ఆక్టోబర్18తో ముగియనుంది. దీనివలన ఆ బ్యాచ్ విద్యా ర్థులు ఒక సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉన్నందున వారు విద్యాసంవత్సరం నష్టపో కుండా తదుపరి కోర్సులో చేరేందుకు వీలుగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వ హించి జులై అఖరుకు కోర్సు పూర్తి చేయా లని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
🔸డీఈ ఎల్ ఈడీ ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యా ర్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11 తేదీ వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొ న్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించినప్పటికి 20 బోధనా దినాలు తగ్గు తున్నందున ఆరోజులు కూడా కవర్ చేసే విధంగా కళాశాలలు ప్రతిరోజు ఉద యం 9 నుంచి సాయంత్రం 5వరకు నిర్వ హించాలని పేర్కొన్నారు.