APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » EHS » వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు,GO628,Dt.15/11/2019

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు,GO628,Dt.15/11/2019

Posted by APTF 1938
» EHS
» Friday, 15 November 2019


ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల మరియు  గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, శానిటరీ ఉద్యోగులు, ప్రైవేటురంగ ఉద్యోగులు కూడా హెల్త్ కార్డులు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక ముందుడుగు వేసింది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకం  విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారిని కూడా ఈ పథకానికి వర్తింపచేసింది. అలాగే అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్‌ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా తేల్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రుల్లో ఈ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రారంభించిన విషయం తెలిసిందే
ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.
  • ➤12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు
  •  ➤మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
  • ➤వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారు అర్హులు
  • ➤ 5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
  • ➤334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు 
  • ➤5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
  •  ➤ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ..  గౌరవ వేతనం  ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు 
  • ➤కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు
  • ➤కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938