- ఉద్యోగుల కరోనా వైద్య ఖర్చులకూ రీయింబర్స్ మెంటు
- ఆరోగ్యశ్రీ మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ
- ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక వెల్లడి
(ఉద్యోగులు న్యూస్)
కరోనా వైద్యం సమయంలో ఉద్యోగుల ఆరోగ్య కార్డులు నిరాకరించినందున ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో సుముఖత వ్యక్తం చేశారని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక వెల్లడించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత వారు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఐక్య వేదిక ఛైర్మన్ ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, జోసెఫ్ సుధీర్ బాబు,జి. హృదయరాజు తదితరులు ఈ విషయం వెల్లడించారు
ఉద్యోగులకు కరోనా సమయంలో ఆరోగ్య కార్డులు నిరాకరించి వైద్యం అందించని నెట్ వర్కు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఐక్య వేదిక నేతలు బండి శ్రీనివాసరావు, షేక్ సాబ్జి, జి.హృదయరాజు, సోమేశ్వరరావు తదితరులు సమావేశానికి ముందే ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను క్రోడీకరించారు. వీటిని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జునరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
ఐక్య వేదిక డిమాండు చేయగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి కోవిడ్-19 చికిత్స లో కార్డులను నిరాకరించి డబ్బులను దండుకొన్న ఆసుపత్రులపై చర్యలు. కార్డులపై వైద్యం నిరాకరించినందున ఉద్యోగులకు ఆ మొత్తం రికవరీ చేసేందుకు పరిశీలన.
మెడికల్ రియింబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వులు త్వరలో జారీ చేసేందుకు హామీ. కోవిడ్ కు వర్తించేందుకు పరిశీలన. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల నిబంధనల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఎయిడెడ్ , మోడల్ స్కూల్, గురుకుల విద్యాలయాలు, గ్రంథాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో కొత్త కార్డుల జారీ. పెండింగ్ లో ఉన్న 3,800 మెడికల్ బిల్లులను త్వరలో మంజూరుకు హామీ.
విద్యా శాఖలో మెడికల్ రియింబర్స్మెంట్ ప్రక్రియ త్వరలో సులభతరం చేసేందుకు హామీ
గతంలో కాలిపోయిన మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు 212 లో ప్రస్తుతానికి 65 వరకు మంజూరుకు సానుకూలం.. ఉభయగోదావరి జిల్లాల్లోని 7 మండలాల్లోని టీచర్లకు ఆరోగ్య కార్డుల జారీకి ప్రక్రియ వేగవంతం చేస్తామని మేనేజ్ మెంటు కమిటీ సమావేశంలో హామీ లభించిందని జేఏసీ పేర్కొంది.
------------------------------------------------------
హెల్త్ కార్డ్స్ అమలు చేయని నెట్వర్క్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి - మెడికల్ రియంబర్సమెంట్ కొనసాగించాలి: ఏపి జెఏసి
ఈ రోజు జరిగిన Dr.YSRT EHS మేనేజ్మెంట్ కమిటి సమావేశం CEO శ్రీ.మల్లికార్జున IAS గారి అధ్యక్షతన మంగళగిరి లో జరిగింది. మేనేజ్మెంట్ కమిటిలో సభ్యులుగా వున్న AP JAC ఛైర్మన్, డెప్యూటీ సెక్రెటరీ జనరల్ లు యన్.చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసులు (APNGO's Aso.), సెక్రెటరీ జనరల్: సి. హెచ్.జోసెఫ్ సుధీర్ బాబు (STU), కో- చైర్మన్లు : షేక్ సాబ్జీ (UTF) , జి.హృదయ రాజు (APTF:1938), సోమేశ్వర రావు ( ఏపి ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ) తదితరులు సమావేశానికి ముందే రాష్ట్రంలోని ఉద్యోగ ,ఉపాద్యాయ, పెన్షనర్స్ ల EHS కార్డ్స్ మరియు మెడికల్ రియింబర్స్మెంట్ విషయంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను క్రోడీకరించి కమిటి సమావేశంలో మాట్లాడారు.
కొన్ని తీర్మానాలు:
- కోవిద్-19 చికిత్స లో కార్డులను నిరాకరించి డబ్బులను దండుకొన్న ఆసుపత్రులపై చర్యలు.
- కార్డులపై వైద్యం నిరాకరణకు గురైన ఎంప్లాయీస్ కు రికవరీ అమౌంట్ పై పరిశీలన
- మెడికల్ రియింబర్స్మెంట్ కొనసాగింపు ఉత్తర్వులు త్వరలో జారీ - నూతనంగా కోవిద్ కు వర్తింపు
- డిజిటల్ హెల్త్ కార్డ్స్ త్వరలో జారీ
- EHS నిబంధనల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఎయిడెడ్ /మోడల్ స్కూల్/ గురుకుల విద్యాలయాలు/ గ్రంథాలయాల ఎంప్లాయిస్ & టీచర్స్ కు కొత్త కార్డులు త్వరలో జారీ
- పెండింగ్ లో ఉన్న 3,800 మెడికల్ బిల్లులను త్వరలో మంజూరు చేస్తారు
- విద్యా శాఖలో మెడికల్ రియింబర్స్మెంట్ ప్రక్రియ త్వరలో సులభతరం
- గతంలో కాలిపోయిన మెడికల్ రియింబర్స్మెంట్ బిల్లులు 212 లో ప్రస్తుతానికి 65 వరకు మంజూరుకు సిద్దం
- తూ. గో & ప. గో జిల్లాల్లోని 7 మండలాల్లోని టీచర్స్ కు EHS కార్డ్స్ జారీకి ప్రక్రియ వేగవంతం.... తదితర అనేక అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది.
- ఏపి జెఏసి