APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » Tanpa Label » ఉపాధ్యాయుల బదిలీలకు కార్యాచరణ , దరఖాస్తుల స్వీకరణ 29 నుంచి

ఉపాధ్యాయుల బదిలీలకు కార్యాచరణ , దరఖాస్తుల స్వీకరణ 29 నుంచి

Posted by Mohan
» Thursday, 15 October 2020



 ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు, హేతుబద్దీకరణ, బదిలీలకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ సంచాలకులు చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19 నుంచి నవంబరు 30 వరకు 43రోజులపాటు ఈ ప్రక్రియను కొనసాగనుంది. మొదట తాత్కాలిక పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత హేతుబద్దీకరణ, బదిలీలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 29 నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్దీకరణ చేపడతారు.

పూర్తివివరాలు, కౌన్సెలింగ్‌ షెడ్యూలు
ఏదైనా పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు ఎక్కువగా ఉంటే అక్టోబరు 14న ఉన్న సంఖ్య ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ అనుమతితో నిర్ణయిస్తారు. సంబంధిత పాఠశాలలో 18 నవంబరు 2012కు ముందు నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, 18 నవంబరు 2015 నుంచి ఉన్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. ఉపాధ్యాయులకు 8, ప్రధానోపాధ్యాయుడికి 5 అకడమిక్‌ సంవత్సరాలుగా నిర్ణయించారు.

డీఈవో పూల్‌ పోస్టుల తొలగింపు

అక్టోబరు 1 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు అర్హులు.

రెండేళ్లలో పదవీవిరమణ పొందనున్న వారికి ఉండదు. కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాల నుంచి పోస్టులను అవసరం ఉన్న చోటుకు మారుస్తారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టును మార్పు చేస్తారు.

అంధులకు బదిలీల నుంచి మినహాయింపు. కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.

డీఈవో పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను వారు వేతనాలు తీసుకుంటున్న పాఠశాలల్లో ఉన్నట్లు మాత్రమే చూపుతారు. ఇక నుంచి ఆ పూల్‌లో ఉండరు.

వృత్తి విద్య, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌, భాషా పండితులు గ్రేడ్‌-2 తదితర ఉపాధ్యాయులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది.

ఉన్నతీకరించిన పోస్టులకు అర్హత లేని వ్యాయామ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కొనసాగాలి.

ఏదైనా పాఠశాలను మరొక దానిలో కలిపేసి ఉంటే ఆ తేదీనే సర్వీసుగా తీసుకుంటారు.

పదోన్నతుల వారికి..
హేతుబద్దీకరణ, బదిలీలకు ముందు తాత్కాలిక పదోన్నతులు కల్పించనున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వరకు పదోన్నతులిస్తారు. అలా పొందిన వారికి కౌన్సెలింగ్‌లోనే పోస్టింగ్‌లు ఇస్తారు.

షెడ్యూల్‌ ఇలా..👇
తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్‌: అక్టోబరు 19-20

హేతుబద్ధీకరణ ప్రక్రియ: 21 నుంచి 26

 మేనేజ్‌మెంట్‌, కేటగిరీ, సబ్జెక్టు, మీడియం వారీగా ఖాళీల ప్రదర్శన: 27, 28

స్వీయ ధ్రువీకరణతో హెచ్‌ఎం, ఉపాధ్యాయుల దరఖాస్తుల స్వీకరణ: 29 అక్టోబరు- 2 నవంబరు

* ఆన్‌లైన్‌లో పరిశీలన: నవంబరు 3- 4

* ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రదర్శన 5- 9

* వెబ్‌సైట్‌లో అభ్యంతరాల స్వీకరణ: 10-12

* జేసీల ఆమోదంతో వెబ్‌సైట్‌లో అభ్యంతరాల పరిష్కారం: 13- 15

* తుది సీనియారిటీ జాబితా: 16- 18

* వెబ్‌ఆప్షన్ల నమోదు: 19-21

* తుది కేటాయింపుల ప్రదర్శన: 22- 27

* తుది కేటాయింపుల్లో సాంకేతిక సమస్యలు ఉంటే సమీక్ష: 28-29

* వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు: 30

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938