రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఉన్న ఉపాధ్యాయులు , మరో రెండు లక్షల మంది ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు , కె . వెంకటేశ్వరరావు లు ప్రభుత్వాన్ని కోరారు . ముఖ్యమంత్రి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని వారు ఒక ప్రకటనలో కోరారు . ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వ సంఘాలు , గుర్తింపు ఉన్న ఉపాధ్యాయ , ఉద్యోగ సంఘాలు వున్నాయని వారందరితో చర్చించాలని డిమాండ్ చేశారు . 11 వ పీఆర్సీ , 5 డీ . ఏ లు , రెండు నెలల సగం జీతాలు , సీపీఎస్ రద్దు పెండింగ్ లో ఉన్నాయని , ఆరోగ్య కార్డుల సమస్యలు , అనేక సర్వీస్ అంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు . తక్షణమే చర్చలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .