మిత్రులారా!
ఈ రోజు డైరెక్టర్ పాఠశాల విద్య వారితో పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ సమావేశం జరిగింది.
ఇందులో అదనపు సంచాలకులు. శ్రీ సుబ్బారెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీస్ మరియు జె డి సర్వీసెస్ దేవనందరెడ్డి, గుంటూరు ఆర్ జె డి రవీంద్రనాథ్ రెడ్డి, జె డి మధుసూదనరావు, ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గార్లు పాల్గొన్నారు. ఇందులో
1. యాప్ ల భారం తగ్గించుటకు వచ్చే వారంలో ఒక వర్క్ షాప్ నిర్వహిస్తారు.
2.2003 డి ఎస్ సి వారికి పాత పెన్షన్ మంజూరుకు ఫైల్ ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపబడింది.
3.ఉపవిద్యా శాఖాది కారులుగా అర్హులైన వారిని తాత్కాలికంగా నియమిస్తారు.
4.నెలవారీ ప్రమోషన్లు ఇచ్చుటకు అంగీకరించారు అయితే కేటగిరి3 లేక4 కి వెళ్ళవలసి ఉంటుంది.
5.అర్హతలు లేని పి ఈ టి లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పి డి లుగా నియమిస్తారు.
5.డి ఎస్ సి లేక అకడమిక్ ఇన్స్ట్రాక్టర్ లను నియమించాలా అనేదానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
6.12 సంవత్సరాలు దాటిన ఎస్ జి టి లను ఎస్ ఏ క్యాడర్ లో నియమించుటకు ప్రతిపాదనలు పంపుతారు.
7.మోడల్ పాఠశాలల నందు టి జి టి నుంచి పి జి టి లకు ప్రమోషన్ ఇస్తారు.
8.కోవిడ్ బాధిత ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు ఇచ్చెదరు
9.అంతర్ జిల్లా బడిలీలలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది త్వరలో అప్లికేషన్స్ పిలుస్తారు.
10.నాడు నేడు లో మండల ఇంజినీర్ కాకుండ సచివాలయ ఇంజినీర్ కి బాధ్యతలు ఇస్తారు.
11.నాడు నేడులో ప్రధానోపాధ్యాయులకు బాధ్యత తగ్గించేందుకు ఆలోచన చేస్తారు.
12.బదీలలో నిజంగా నష్టపోయిన వారికి ఏదైనా డి డి ఓ ద్వారా తగిన ధ్రువ పత్రంతో వస్తే పరిష్కరిస్తారు.
13.ఎం ఈ ఓ ల బదిలీలు ఫైలు ప్రభుత్వానికి పంపుతారు.
14.కోవిడ్ తీవ్రత దృష్ట్యా పాఠశాలలు ఎలా జరపాలి ఆల్టర్ నేటివ్ డే గా, లేక ఇంకా ఏమైనా పద్దతి ఉంటే పంపమని కోరారు.
15.అమ్మఒడి ఇంకా 80000 మందికి పెండింగ్ ఉన్నదని దీనిపై నిశిత పరిశీలన చేసి క్రెడిట్ చేస్తామని చెప్పారు.
16.ఏ పి టెల్స్ ఓ టి పి రానప్పుడు ఆందోళన చెందకుండా డి డి ఓ కి లెటర్ ఇస్తే సరిపోతుందని చెప్పారు.
16.కొన్ని తక్షణ సమస్యల వల్ల కొంత సమాచార పొరబాటు జరగకుండా చూస్తామని చెప్పారు.
17. సర్వీసు రూల్స్ సాధ్యం కాని పరిస్థితులలో ఇతర మార్గాలు అన్వేషించి త్వరలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
18.అన్ని రకాల పెండింగ్ బదిలీలు మే 9 నాటికి పూర్తి చేసి విద్యా సంవత్సరం చివరి రోజున రిలీవ్ అయ్యే విదంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.
19. గుర్తింపు పొందిన సంఘాల బాద్యులకు21 రోజులు ఏ పి టెల్స్ నందు అప్డేట్ చేస్తామని చెప్పారు.
20. స్పెషల్ విద్యా వాలేంటర్ ల సర్వీసు సమస్య పరిష్కారానికి ప్రాతినిధ్యం చేయడమైనది.
కె కులశేఖర్ రెడ్డి, సహాధ్యక్షులు
కె. వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్