నవభారత రాజ్యాంగ నిర్మాత డా౹౹ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునిఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నెల్లూరు పద్మావతి సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి కొనియాడారు. అనితర సాధ్యమైన రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ దాస్, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ రాధాకృష్ణ, వెంకటాచలం మండల నాయకులు సుధాకర్, టి.పి గూడూరు నాయకులు రామచంద్రయ్య, రిటర్డ్ టీచర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.